Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌ ఎండ‌లోనే నిల‌బెట్టి కేంద్ర మంత్రిని నిల‌దీసిన యువ‌తి!

  • ఇంఫాల్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌ కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్‌కు చేదు అనుభ‌వం
  • వీఐపీల కార‌ణంగా విమానాలు ఆల‌స్యం అవుతున్నాయ‌ని యువ‌తి వాద‌న‌
  • కేంద్ర మంత్రి స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీత‌
  • ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న‌
మ‌ణిపూర్‌లోని ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. వీఐపీల కార‌ణంగా విమానాలు ఆల‌స్యం అవుతున్నాయ‌ని, ప్రయాణికుల‌కు అసౌక‌ర్యం క‌లుగుతోంద‌ని ఓ యువ‌తి ఆయ‌న‌తో వాదించింది. స‌ద‌రు కేంద్ర మంత్రి ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా ఆయ‌న‌ను అక్క‌డే ఆపి ఆ యువ‌తి నిల‌దీసింది. విమానాల ఆల‌స్యంపై కేంద్ర‌ మంత్రి స‌మాధానం చెప్పాల‌ని ఎండ‌లోనే కాసేపు నిల‌దీసింది. తాను పాట్నాకు వెళ్లాల్సి ఉంద‌ని, తానో డాక్ట‌ర్‌న‌ని స‌మ‌యానికి వెళ్ల‌క‌పోతే రోగుల ప‌రిస్థితి ఏం కావాలని ప్ర‌శ్నించింది. ఆమెకు న‌చ్చజెప్పిన కేంద్ర మంత్రి అక్క‌డి నుంచి చివ‌ర‌కు జారుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో హల్‌చ‌ల్ చేస్తోంది.




airport
imphal
union minister

More Telugu News